విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి | students should concentrate on studies | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

Aug 15 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:24 AM

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

భీమారంలోని ఎస్‌వీఎస్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థినులకు సీనియర్లు స్నేహపూర్వక స్వాగతం పలికారు.

భీమారం : భీమారంలోని ఎస్‌వీఎస్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థినులకు సీనియర్లు స్నేహపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌వీఎస్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రబెల్లి తిరుమల్‌రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్‌వీఎస్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఇ.సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement