టీచర్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు | students protest for teachers | Sakshi
Sakshi News home page

టీచర్ల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

Jan 28 2016 1:55 PM | Updated on Aug 30 2018 3:58 PM

తమ బడిలో టీచర్లు లేరని, పిల్లలకు విద్యాబుద్ధులు నేరే వారే కరువయ్యారని మూడు నెలలుగా ఆ గ్రామస్తులు చేస్తున్న వినతులు బుట్టదాఖలయ్యాయి.

కంచిలి: తమ బడిలో టీచర్లు లేరని, పిల్లలకు విద్యాబుద్ధులు నేరే వారే కరువయ్యారని మూడు నెలలుగా ఆ గ్రామస్తులు చేస్తున్న వినతులు బుట్టదాఖలయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను తీర్చేలా లేరని భావించిన గ్రామస్తులు, విద్యార్థులు చివరికి రోడ్డెక్కారు.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్నాపురంలోని ఎలిమెంటరీ స్కూల్‌లో 40 మంది పిల్లలుండగా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేసేశారు. ఇది మూడు నెలల క్రితం మాట. ఆ ఇద్దరినీ బదిలీ చేసిన అధికారులు అక్కడికి మరో ఇద్దరిని పంపారు. అయితే, అక్కడికి బదిలీ అయిన వారెవరూ విధుల్లో చేరటం లేదు. దీంతో విద్యార్థులకు చదువు దూరమైంది. ఆగ్రహించిన స్థానికులు గురువారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు కలసి రహదారిపై బైటాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement