పాముకాటుతో ఓ వి ద్యార్థి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని బుస్సాపురంలో బుధవారం జరి గిం ది. ములుగు ఎస్సై సూర్యనారాయణ కథనం ప్రకారం.. బుస్సాపురం గ్రామానికి చెందిన పోలెపాక రాజశేఖర్(11) పాఠశాల నుంచి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది
పాముకాటుతో విద్యార్థికి అస్వస్థత
Sep 8 2016 12:34 AM | Updated on Nov 9 2018 5:02 PM
గోవిందరావుపేట : పాముకాటుతో ఓ వి ద్యార్థి అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని బుస్సాపురంలో బుధవారం జరి గిం ది. ములుగు ఎస్సై సూర్యనారాయణ కథనం ప్రకారం.. బుస్సాపురం గ్రామానికి చెందిన పోలెపాక రాజశేఖర్(11) పాఠశాల నుంచి ఇంటికి వచ్చి కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది.
దీంతో అతడిని తరలించేందుకు తండ్రి సంపత్ బంధువులు రోదిస్తూ రోడ్డుకు తీసుకొచ్చారు. అదే సమయంలో మరో కేసు విషయంలో విచారణకు మండలానికి వచ్చిన ములుగు రెండో ఎస్సై సూర్యనారాయణ అటుగా వెళుతూ ఉండగా వారిని గమనించి విద్యార్థిని తన వాహనంలో ములుగు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
Advertisement
Advertisement