చరిత్రకు ఆనవాళ్లు నాణేలు

చరిత్రకు ఆనవాళ్లు నాణేలు

  • 291 దేశాల నాణేలు, కరెన్సీనోట్లు, స్టాంపుల ప్రదర్శన

  • ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు

  • రావులపాలెం : 

    చరిత్రకు అద్దం పట్టే వివిధ దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో అమలాపురానికి చెందిన పి.కృష్ణకామేశ్వర్‌  శుక్రవారం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మన దేశంతో పాటు 291 దేశాలకు చెందిన నాణేలు, నోట్లు అందర్నీ అబ్బురపరచాయి. మంగోలియా దేశం తాజ్‌మహల్‌ చిత్రంతో విడుదల చేసి నాణెం, సోమాలియా దేశం గిటార్లు, త్రిజ్యామితీయ ఆకృతులతో, నియో దేశపు స్‌పైడర్‌మ¯ŒS చిత్రపు నాణెం, ప్రపంచంలో తొలి సారిగా ట్రా¯Œ్సనిస్ట్రియా దేశం విడుదల చేసి ప్లాస్టిక్‌ నాణేలు, బెని¯ŒS దేశం విడుదల చేసిన పరిమళపు నాణెం, వియాత్నాంకు చెందిన రూ.50 వేలు, రూ.లక్ష నోటు, 45 దేశాలకు చెందిన ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లు, కెనడా, ఇండియా, ఐక్యరాజ్య సమితి తపాల విభాగాలు విడుదల చేసిన స్టాపులు, ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎంఎస్‌ సుబ్బులక్ష్మి చిత్రంతో విడుదల చేసిన స్మారక స్టాంపు, భారత  ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీ నోట్లు, నాణేలు, పలు దేశాలకు చెందిన స్టాంపులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వీటి గురించి కామేశ్వర్‌ సమగ్రంగా వివరించారు. ప్రదర్శనను రావులపాలెంలోని పలు కళాశాల విద్యార్థులు తిలకించారు. తొలుత ఈ ప్రదర్శనను దివ్యాంగుల సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు పేరి లక్ష్మినరసింహం, ప్రిన్సిపాల్‌ కె.వి.రమణారావు ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలు, డెబిట్, రూపే కార్డులు వినియోగించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top