పట్టభద్రుల నియోజకవర్గం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ పశ్చిమ రాయలసీమ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మసూలు శ్రీనివాసులును ఎంపిక చేసింది.
అనంతపురం అర్బన్ : పట్టభద్రుల నియోజకవర్గం అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ పశ్చిమ రాయలసీమ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మసూలు శ్రీనివాసులును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి కేవీరమణ, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్‌తో కలిసి శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, కొండారెడ్డి, హరిరాయల్, తదితరులు పాల్గొన్నారు.