స్వర్ణ విహంగం | Sakshi
Sakshi News home page

స్వర్ణ విహంగం

Published Sun, Oct 23 2016 7:16 PM

స్వర్ణ విహంగం

  • శ్రీనివాస్‌ మరో అద్భుత సృష్టి
  • 2.700 మి.గ్రా. స్వర్ణంతో బుల్లి హెలికాఫ్టర్‌ తయారీ
  • బిక్కవోలు :
    మరో అద్భుత వస్తువు తయారీతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు బిక్కవోలుకు చెందిన స్వర్ణకారుడు అంబవరపు శ్రీనివాస్‌. గతంలో 200 మిల్లీ గ్రాముల బంగారంతో సైకిల్‌ నమూనాను తయారు చేసి చేతి గడియారంలో ఇమిడ్చి పలువురి ప్రశంసలందుకున్నారు. తాజాగా 2.700 మిల్లీ గ్రాముల బంగారంతో వారం రోజులు పాటు శ్రమించి బంగారు హెలికాప్టర్‌ను రూపొందించారు. అంగుళం ఎత్తు, అంగుళం పొడవున ఉన్న ఈ స్వర్ణ విహంగానికి పైన నాలుగు రెక్కలు, వెనుక ఫ్యా¯ŒSతో పాటు తెరుచుకునే విధంగా రెండు డోర్లు ఏర్పాటు చేశారు. వాటికి అద్దాలను కూడా అమర్చారు. జాతీయ జెండా చిహ్నంతో పాటు ఇండియా అనే అక్షరాలను ఆంగ్లంలో మూడు రంగులతో ముద్రించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ 15 ఏళ్లుగా తన తండ్రి రాము వద్ద స్వర్ణభరణాల తయారీలో శిక్షణ పొందానని చెప్పారు. ఖాళీ సమయాలలో ఇలాంటి వస్తువులను తయారు చేస్తున్నానని తెలిపారు. ఈ కళాకృతుల ద్వారా గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. బంగారు హెలికాఫ్టర్‌ నమూనాను చూసిన వారంతా శ్రీనివాస్‌ను అభినందిస్తున్నారు.   
     

Advertisement
 
Advertisement
 
Advertisement