ప్రజా సాధికార సర్వే పట్ల అలసత్వం వహించిన ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు
Sep 27 2016 12:13 AM | Updated on Oct 16 2018 6:33 PM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా సాధికార సర్వే పట్ల అలసత్వం వహించిన ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాసాధికార సర్వే ప్రారంభమై నెలలు గడుస్తున్న ఇప్పటికి ఆదోని, ఆత్మకూరు, డోన్ మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా సర్వే పూర్తి కాలేదు. డోన్‌లో కేవలం 39 శాతం మాత్రమే సర్వే పూర్తి అయింది. ఆదోని, ఆత్మకూరుల్లోను సర్వే 50 శాతం లోపే ఉంది. సర్వేను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్, జేసీలు చెబుతున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఈ ముగ్గురు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని నోటీసులో ఆదేశించారు.
Advertisement
Advertisement