అద్దెనా.. ఇద్దాములే..! | notice to bhuvangiri muncipolity for rental dues | Sakshi
Sakshi News home page

అద్దెనా.. ఇద్దాములే..!

Nov 27 2017 12:47 PM | Updated on Oct 16 2018 6:35 PM

notice to bhuvangiri muncipolity for rental dues - Sakshi

తమకు రావాల్సింది ఉంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసే ప్రభుత్వ శాఖలు.. వాటి విషయా నికొస్తే మరోలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అందుకు భువనగిరి మున్సిపాలిటీలో నిలిచిపో
యిన అద్దెల బాగోతమే నిదర్శనం. మున్సిపల్‌ భవనంలో కొనసాగు తున్న పలు డిపార్ట్‌మెంట్‌లు నెలల తరబడి అద్దె చెల్లించకుండా మొండికే స్తున్నాయి. నోటీసులు జారీ చేసినా నో రెస్పాన్స్‌. ఒత్తిడి తెస్తే ఎంతోకొంత చేతిలో పెట్టి మకాం మారుస్తున్నాయి.

భువనగిరి : మున్సిపాలిటీకి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు 13 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. దీంతో   మున్సిపాలిటీకి వచ్చే కిరాయిలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. పాలనా సౌలభ్యం కోసం 2016, అక్టోబర్‌ 11వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. నూతన జిల్లా కావడంతో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్డర్‌ టూ సర్వ్‌ ప్రతిపాదికన అధికారులను నియమించి జిల్లా కార్యాలయ నిర్వహణకు అందుబాటులో ఉన్న భవనాలను అద్దెకు తీసుకున్నారు. ఇందులో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ ఆవరణలో ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్స్‌ ఫర్‌ స్మాల్, మీడియం టౌన్స్‌ పథకంలో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం మున్సిపాలిటీకి పెద్దగా ఉపయోగం లేకపోవడంతో  ప్రభుత్వ శాఖలకు చెందిన 11 కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు.

ఏయే శాఖలంటే..
మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న భవన సముదాయంలో 11 శాఖలకు అద్దెకు ఇచ్చారు. ఇందులో ఒక శాఖ ఆరు నెలల అద్దె చెల్లించి ఖాళీ చేసింది. మిగిలిన 10 శాఖల కార్యాలయాలు అక్కడే కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ అభివృద్ధి కార్యాలయాలు, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా క్రీడలు యోజన, సర్వీసుల శాఖ, మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆహార పరిరక్షణ, జిల్లా టౌన్‌ ప్లానింగ్, జిల్లా పంచాయతీ, జిల్లా ఆడిట్‌ అధికారి శాఖ, ఉపాధి కల్పన అధికారి శాఖలు ఉన్నాయి.వీటిలో గిరిజన శాఖ ఐదు నెలలు, ఐసీడీఎస్‌ మూడు నెలలు, ఆడిట్‌ కార్యాలయం ఐదు నెలలు, ఉపాధి కల్పన శాఖ ఆరు నెలల చొప్పున అద్దె చెల్లించాయి. మిగిలిన శాఖలు 13 నెలల కిరాయి బకాయి పడ్డాయి. ఆయా శాఖలు రూ.11.06 లక్షలు చెల్లించాలని తెలుస్తోంది.  

నోటీసులు జారీ..
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అద్దె చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతోనే తమకు నిధులు రావడం లేదని ఉపాధి కల్పన కార్యాలయం మరో చోటకు ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 10 శాఖలకు మున్సిపల్‌ అధికారులు   అద్దె చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement