జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యచంద్రయాదవ్, జయచంద్ర డిమాండ్ చేశారు.
కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టాలి
Dec 12 2016 11:51 PM | Updated on Jun 1 2018 8:39 PM
ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
అనంతపురం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యచంద్రయాదవ్, జయచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. కరువు జిల్లా పేద, మధ్య తరగతి వారికి విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. జిల్లా కరువు పరిస్థితుల దృష్టా ్య బాలికలు డ్రాపౌట్స్ కాకుండా వారికి చదువుకునే అవకాశం కల్పించాలన్నారు. నాయకులు హరీష్, శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Advertisement