మద్యం విక్రయిస్తున్న షాపులపై దాడులు | selling liquor on Gandhi Jayanti in kalyandurg | Sakshi
Sakshi News home page

మద్యం విక్రయిస్తున్న షాపులపై దాడులు

Oct 2 2015 4:27 PM | Updated on Sep 3 2017 10:21 AM

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.

అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అనంతరం దుకాణాలను మూసి వేశారు. పట్టణంలో మద్యం దుకాణాల వద్ద అమ్మకలు జరుగుతున్నాయని ఎక్సైజ్ సీఐ అన్నపూర్ణకు సమాచారం అందింది.

దీంతో ఆమె కళ్యాణదుర్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న షాపులను మూసివేశారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణ వ్యాపారులను సీఐ అన్నపూర్ణ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement