వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్నినాని
అనుమతులు, అక్రమ నిల్వలు ఉన్న కర్మాగారాన్ని తక్షణమే సీజ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ బాబు.ఎ ను డిమాండ్ చేశారు.
మచిలీపట్నం(ఈడేపల్లి) :
అనుమతులు, అక్రమ నిల్వలు ఉన్న కర్మాగారాన్ని తక్షణమే సీజ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), కలెక్టర్ బాబు.ఎ ను డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. పేర్ని మాట్లాడుతూ రేషన్ డిపోలో ఈ పోస్ విధానాన్ని ఏర్పాటు చేసి ఒక్క బస్తా బియ్యం తేడావస్తేనే సదరు డీలరుపై క్రిమినల్ కేసు నమోదు చేసే కలెక్టర్, దాదాపు రూ.85 లక్షల విలువ చేసే నకిలీ ఎరువులు పట్టుకున్న అతనిపై క్రిమినల్ కేసు ఎందుకు నమోదు చేయలేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం రుద్రవరంలోనే అనుమతులు లేకుండా రెండేళ్ల క్రితం నిర్మించినకర్మాగారాన్ని ఎం దుకు పట్టించుకోలేదని ప్రశ్నిం చారు. ఈ నెల 12వ తేదీlవిజిలె¯Œæ్స దాడులు నిర్వహించగా రికార్డులను పరిశించి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు తిరిగి వెళ్లి మళ్లీ అధికారులు 14వ తేదీ మరోసారి దాడిచేయడంపై విస్మమయం వ్య క్తం చేశారు. అంతేకాకుండా 12వ తేదీ నుంచి 14వ తేదీ రాత్రి వరకు మంత్రి కొల్లు రవీంద్ర, 80 నుంచి వంద సార్లు విజిలెన్స్ అధికారులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు..
రైతులను మోసం చే సి అమ్మకాలు జరిపే ఫ్యాక్టరీలో వాటా ఎంత అని మంత్రిని ప్రశ్నించారు. బ్లాక్‌లో ఎరువులు తయారీ, బెల్టుషాపుల వలన ఎంత కమీషన్ తీసుకుంటున్నారో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని సోమవారం కలెక్టర్‌ను కలవనున్నట్లు చెప్పారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బొర్రా విఠల్‌రావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలజోషి, కౌన్సిలర్‌లు మేకల సుధాకర్ బాబు, శీలం మారుతీరావు(బాబ్జి), లంకా సురిబాబు, ఆస్గర్‌అలీ పాల్గొన్నారు.