భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం మంగళవారం జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఒంగోలు: భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్ స్కూళ్ళలో స్కౌట్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత ఉపాధ్యాయులు వారి సభ్యత్వ రుసుంను కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఉపాధ్యాయులను సంబంధిత మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 5వ తేదీన తప్పనిసరిగా రిలీవ్ చేసి సమావేశానికి హాజరయ్యేటట్లు చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.