రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ | satilite bus station | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

Jul 28 2016 8:33 PM | Updated on Sep 4 2017 6:46 AM

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

పుష్కరాలను పురస్కరించుకుని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.




 


కానూరు (పెనమలూరు) : పుష్కరాలను పురస్కరించుకుని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపురం, భీమవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే యాత్రికులు ఇక్కడ బస్సు దిగాల్సి ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి విజయవాడ పుష్కర ఘాట్‌లకు ప్రత్యేకంగా సిటీ బస్సులు నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్‌ జయరావు, కృష్ణా రీజినల్‌ మేనేజర్‌ పీవీ రామారావు, సీఎంఈవో ప్రసాద్, డివిజనల్‌ మేనేజర్‌ శ్రీరాములు, సివిల్‌ ఇంజినీర్‌ శాస్త్రి, గవర్నర్‌పేట డిపో వన్‌ మేనేజర్‌ చరణ్‌ పాల్గొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement