సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి | samkranthi festival | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

Jan 12 2017 10:41 PM | Updated on Sep 5 2017 1:06 AM

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు రంగవల్లులు దర్పణాలుగా నిలుస్తాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. బుధవారం రాత్రి రమణయ్యపేట పంచాయతీ

  • వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి
  • కాకినాడ రూరల్‌ : 
    తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు రంగవల్లులు దర్పణాలుగా నిలుస్తాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని  వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. బుధవారం రాత్రి రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెం, కొత్తూరులలో పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పాలగుమ్మి నాగరాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. పండగల్లో సంస్కృతితో పాటు భక్తి, సేవాగుణం, అనుబంధాలు, ఆటపాటలు, ఉల్లాసం, ఉత్సాహం సమ్మిళితమై ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు.  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రవి, నాగరాణిలు సంక్రాతి ఉత్సవాలను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గ్రామాల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో రాయుడుపాలెంలో వినూత్న పద్ధతిలో ఇంటింటా సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటి వద్దా రంగవల్లులు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు తమ ఇళ్ల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి గ్రామ ఐక్యతను చాటారు. వారిలో ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. మరో 9 మందికి కన్సొలేష¯ŒS బహుమతులు, 10 మందికి లక్కీడిప్‌ ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మరో 11 మందికి మొత్తం 36 మందికి బహుమతులు అందజేశారు. కూచిపూడి, భరతనాట్యం, చిన్నారులతో సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. గ్రామస్తుల కోరికపై జక్కంపూడి విజయలక్ష్మి లింగం రవిని దుశ్శాలువాతో సత్కరించారు. పెద్దాపురం స్పెషల్‌ కోర్టు జడ్జి సూరిబాబు, ఫుడ్‌ కార్పొరేష¯ŒS ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కన్సలే్టటివ్‌ కమిటీ సభ్యుడు అబ్బిరెడ్డి ప్రభాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చెల్లే శేషారావు, విత్తనాల రమణ, పెంకే వీరబాబు, కొత్తపల్లి గిరీష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి డీకే వరప్రసాద్, మహిళా నాయకులు పల్లా కాత్యాయని, వెంట్రు స్వర్ణలత, ముదిలి శ్రీదేవి, మాలతి, రజని తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement