మాదాపూర్‌లో మెరిసిన సమంత | samatha participated a private function in madhapoor | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో మెరిసిన సమంత

Sep 11 2016 11:17 PM | Updated on Apr 3 2019 9:14 PM

మాదాపూర్‌లో మెరిసిన సమంత - Sakshi

మాదాపూర్‌లో మెరిసిన సమంత

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పేరం గ్రూప్‌ మాదాపూర్‌లోని హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మెగా వెంచర్ల ఆవిష్కరణలో సమంత పాల్గొన్నారు

సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్‌ బ్యూటీ సమంత నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో తళుక్కుమన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పేరం గ్రూప్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన మెగా వెంచర్ల ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. ఆదిత్య అంకుర, ఆదిత్య గ్రాండ్, ఆదిత్య వర్ణ, ఆదిత్య లోటస్‌ పేరుతో తాము ఈ వెంచర్లను అందిస్తున్నట్టు సంస్థ సీఈఓ హరిబాబు చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు మారుతి, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. సినీ నేపద్య గాయకులు సింహ, పరిణిక, హరిప్రియ, శోభన తమ పాటలతో డ్యాన్సర్లు నృత్యాలతో అతిథులను అలరించారు.    

Advertisement
 
Advertisement
Advertisement