రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల్లో అర్హులైన వారి జాబితాను విడుదల చేసినట్లు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రజియా సుల్తానా శనివారం ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ అప్రెంటిషిప్ ఎంపిక ఫలితాలు విడుదల
Jun 3 2017 10:50 PM | Updated on Sep 5 2017 12:44 PM
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల్లో అర్హులైన వారి జాబితాను విడుదల చేసినట్లు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రజియా సుల్తానా శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సారి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి రావడంతో ఐటీఐలో వచ్చిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ ట్రైనింగ్ కళాశాలతోపాటు జిల్లాలోని అన్ని డిపో మేనేజరు కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అతికిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, రిజిస్ట్రేషన్ నంబరు, ప్రొఫైల్, కుల ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఈనెల 12వ తేదీన ఉదయం 10:30 గంటలకు తమ కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
Advertisement
Advertisement