నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ వాహనాలను ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం సీజ్ చేశారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 25 ప్రైవేట్ వాహనాలను ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం సీజ్ చేశారు. నగరంలోని హయత్‌నగర్ సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు శనివారం ఉదయం వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రయాణికులను చేరవేస్తున్న 25 వాహనాలను సీజ్‌చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.