రూ.3 కోట్ల విలువైన పంచలోహా విగ్రహాలు స్వాధీనం | Rs. 3 crores worth panchaloha idols seized in warangal police | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన పంచలోహా విగ్రహాలు స్వాధీనం

Mar 18 2016 1:09 PM | Updated on Aug 20 2018 4:27 PM

వరంగల్లో పోలీసులు తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఏడు పంచలోహ విగ్రహాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ : వరంగల్ జిల్లాలోని పలు ఆలయాల్లో పంచలోహ విగ్రహాల చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ములుగు క్రాస్ రోడ్డులోని పెద్దమ్మ గడ్డ ప్రాంతంలో నిందితులు ఆటోలో సంచరిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏడు పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు.

వరంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ... స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో అతి పురాతనమైన రెండు శ్రీరాముడు, సీతమ్మవారి విగ్రహం ఒకటి, వేణుగోపాల స్వామి విగ్రహం, రాధాదేవి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ములుగు మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన తేజావత్ రమేశ్, పర్వతగిరి మండలం వడ్లకోండ గ్రామానికి చెందిన వలందాస్ రంగయ్య, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ అని సుధీర్బాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement