ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ | robbery in ap express | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

Jul 26 2016 1:19 AM | Updated on Sep 4 2017 6:14 AM

తాడేపల్లిగూడెం : ఢిల్లీ నుంచి వస్తున్న ఏపీ ఎక్‌్సప్రెస్‌ టూటైర్‌ ఏసీలో నగదు, బ్యాంకు కార్డులు, అత్యవసర మందులు కలిగిన బ్యాగును బోగీల్లో పని చేసే వ్యక్తులు సోమవారం దొంగిలించినట్టు తణుకు బార్‌ అసోసియేష¯Œæకు చెందిన ఎం.రవిసోమశేఖర్‌ తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాడేపల్లిగూడెం : ఢిల్లీ నుంచి వస్తున్న ఏపీ ఎక్‌్సప్రెస్‌ టూటైర్‌ ఏసీలో నగదు, బ్యాంకు కార్డులు, అత్యవసర మందులు కలిగిన బ్యాగును బోగీల్లో పని చేసే వ్యక్తులు సోమవారం దొంగిలించినట్టు తణుకు బార్‌ అసోసియేష¯Œæకు చెందిన ఎం.రవిసోమశేఖర్‌ తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోపాల్‌లో రైలు ఎక్కానని చాలాసేపటి వరకూ బ్యాగు తనవద్దే ఉందని బోగీల్లో దుప్పట్లు మార్చే వ్యక్తి ఒకరు అనుమానాస్పదనంగా తిరిగారని, కొంత సేపటికి బ్యాగు కలిపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏలూరులోని పోలీసు అధికారి ఒకరికి ఈ సమాచారం బాధితుడు అందించారు. అధికారి ఆదేశం మేరకు తాడేపల్లిగూడెం సివిల్‌ పోలీసులు రైల్వే స్టేషన్‌æకు చేరుకున్నారు. ఏసీ ఎక్‌్సప్రెస్‌ 2.40 గంటలకు తాడేపల్లిగూడెం స్టేషన్‌కు చేరుకోగానే అనుమానిత వ్యక్తిని పోలీసులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ చర్యను నిరసిస్తూ బోగీలో ఇదే తరహా విధుల్లో ఉన్న సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ పలుమార్లు చైన్‌ లాగారు. దీంతో 2.43కు బయలుదేరాల్సిన రైలు దాదాపు 38 నిమిషాలపాటు ఆగిపోయింది.  దీంతో విశాఖ వెళ్లే రెండు రైళ్లను ట్రాక్‌ మళ్లించి రైల్వే అధికారులు పంపించారు. చైన్‌లాగిన వారిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement