పట్టపగలే దోచుకుపోయారు
నల్లాకులవారిపాలెం (పెరవలి) : చుట్టూ నివాసాలు, రద్దీగా ఉండే సెంటర్, జాతీయ రహదారి పక్కనున్న ఇంట్లో పట్టపగలే దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. చోరీలో 25 కాసుల బంగారం, అరకిలో వెండి, రూ.3 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో ర్యాలి వేణుగోపాల దొరయ్యనాయుడు ఇంట్లో చోరీ జరిగింది.
నల్లాకులవారిపాలెం (పెరవలి) : చుట్టూ నివాసాలు, రద్దీగా ఉండే సెంటర్, జాతీయ రహదారి పక్కనున్న ఇంట్లో పట్టపగలే దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. చోరీలో 25 కాసుల బంగారం, అరకిలో వెండి, రూ.3 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పెరవలి మండలం నల్లాకులవారిపాలెంలో ర్యాలి వేణుగోపాల దొరయ్యనాయుడు ఇంట్లో చోరీ జరిగింది. తణుకులో తన అక్క ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావటంతో దొరయ్యనాయుడు దంపతులు, తల్లితో కలిసి మధ్యాహ్నం 1 గంట సమయంలో బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపుల తాళాలు పగలు కొట్టి ఉన్నాయి. దీంతో వీరు కంగారుగా లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. గదిలో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి.
బీరువాలోని సొరుగులో బంగారం, వెండి వస్తువులు, నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నా రు. తణుకు సీఐ చింతా రాంబాబు, పెరవలి ఎస్సై పి.నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వచ్చేనెల 5న తణుకులో బేకరీ ఏర్పాటుచేసుకుందుకు సొమ్ము తీసుకువచ్చి ఇం ట్లో ఉంచానని, దీనినిదోచుకుపోయారని దొరయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సహకారంతోనే చోరీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించామని, క్లూస్‌టీంను రప్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. దొరయ్యనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు చెప్పారు.