నదుల చరిత్రపై అన్వేషణ | research for history of rivers | Sakshi
Sakshi News home page

నదుల చరిత్రపై అన్వేషణ

Jan 6 2017 12:06 AM | Updated on Sep 5 2017 12:30 AM

నదుల చరిత్రపై అన్వేషణ

నదుల చరిత్రపై అన్వేషణ

పన్నెండు​నదుల పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోవడమే ధ్యేయంగా సీనియర్‌ జర్నలిస్టు పొన్నాల గౌరిశంకర్‌(65) సైకిల్‌ యాత్ర చేపట్టి ఆరువేల కిలోమీటర్లు పర్యటించారు.

- గోదావరి వెంట 6వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర 
 - కృష్ణానది వెంట 2,500 కిలోమీటర్ల పర్యటన
 
జూపాడుబంగ్లా:  పన్నెండు​నదుల పుట్టుపుర్వోత్తరాలు తెలుసుకోవడమే ధ్యేయంగా  సీనియర్‌ జర్నలిస్టు పొన్నాల గౌరిశంకర్‌(65) సైకిల్‌ యాత్ర చేపట్టి ఆరువేల కిలోమీటర్లు పర్యటించారు. మూడో పర్యాయంగా కృష్ణానదిపై పర్యటిస్తున్న గౌరిశంకర్‌ గురువారం జూపాడుబంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి పర్యాయం గోదావరి నది వెంట 6వేల కిలోమీటర్లు, రెండో పర్యాయం 7వేల కిలోమీటర్లు ప్రయాణించి నర్మదా నది వెంట ప్రయాణించి వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. మూడోపర్యాయంగా కృష్ణానదిపై పర్యటిస్తున్నానన్నారు. ఆగష్టు 12న కృష్ణాపుష్కరాలను పురష్కరించుకొని సైకిల్‌ యాత్ర ప్రారంచానన్నారు. ఇప్పటి వరకు కృష్ణానది ఉత్తర ఒడ్డుమీదుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి ఏపీలోకి ప్రవేశించినట్లు తెలిపారు. 5వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కృష్ణానది వెంట ఇప్పటి దాకా 2,500 కిలోమీటర్లు ప్రయాణించానని తెలిపారు. 65ఏళ్లు పైబడిన గౌరిశంకర్‌ చెక్కుచెదరని విశ్వాశంతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా సైకిల్‌పైనే సకలసౌకర్యాల వస్తువులతో పాటు జాతీయ పతాకాన్ని పెట్టుకొని పర్యటిస్తుండడం విశేషం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement