రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు? | rekha rani takes charges as mada | Sakshi
Sakshi News home page

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?

Sep 27 2016 11:53 PM | Updated on Apr 6 2019 9:11 PM

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు? - Sakshi

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?

మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు

 
చిలకలపూడి (మచిలీపట్నం):
 మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు. జేసీగా ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అథారిటీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. అథారిటీకి కొత్త వైస్‌చైర్మన్‌ను రెండు రోజుల్లో నియమిస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రేఖారాణికే ఈ బాధ్యతలు కట్టబెట్టవచ్చని సమాచారం.  ఇప్పుడామె శాప్‌కు సారథ్యం వహిస్తున్నారు.  పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేప«థ్యంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement