వాణిజ్య పన్నుల రాబడికి భారీ గండి | Reduced income With currency ban | Sakshi
Sakshi News home page

వాణిజ్య పన్నుల రాబడికి భారీ గండి

Dec 25 2016 12:18 AM | Updated on Sep 22 2018 7:50 PM

‘నోట్ల రద్దు’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్‌ లో సరిపడా నగదు లేకపోవడంతో నవంబర్‌లో రోజువారీ క్రయవిక్రయాలు బాగా పడిపో యాయి.

‘నోట్ల రద్దు’ ప్రభావంతో తగ్గిన ఆదాయం
ఒక్క నవంబర్‌లోనే రూ.500 కోట్ల నష్టం
వెలవెలబోయిన చిల్లర వ్యాపారాలు


సాక్షి, హైదరాబాద్‌: ‘నోట్ల రద్దు’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్‌ లో సరిపడా నగదు లేకపోవడంతో నవంబర్‌లో రోజువారీ క్రయవిక్రయాలు బాగా పడిపో యాయి. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు వ్యాట్‌ రూపంలో వచ్చే ఆదాయం రూ.500 కోట్ల మేర తగ్గింది. సాధారణంగా ప్రభుత్వానికి వ్యాట్‌ ద్వారా నెలకు సగటున రూ.2,800 కోట్లు సమకూరుతుంది. కానీ నోట్ల రద్దు ప్రభావంతో నవంబర్‌లో రూ.2,300 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా తేల్చింది. చెక్కులు, ఇతర రూపాల్లో కొంతమేర ఆదాయం వచ్చినప్పటికీ.. ఆ మొత్తాన్ని రాబడి లోకి తీసుకోలేదు. ఇది రూ.25 కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. ప్రధాన వనరుకే దెబ్బ: వాణిజ్య శాఖ నుంచి నెలకు సగటున రూ.3వేల కోట్ల ఆదాయం సమ కూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ నోట్ల రద్దు కారణంగా ఈ లక్ష్యంలో 20% కోత పడడం సర్కారును కలవరపరుస్తోంది.

 ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల భవిష్యత్తు ప్రధా నంగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఆదా  యంపైనే ఆధార పడిందని చెప్పవచ్చు. ఆ శాఖ నుంచి నెలవారీగా వచ్చే ఆదాయంతోనే ఉద్యో గుల వేతన చెల్లింపులు, పెన్షనర్ల చెల్లింపులు, ఆస రా చెల్లింపులన్నీ ఆధారపడి ముందుకెళ్తున్నాయి. మరోవైపు డిసెంబర్‌లోనూ నగదు సమస్యతో గం దరగోళం నెలకొంది. బ్యాంకుల్లో నగదు లేకపోవ డంతో ఖాతా దారులకు చెల్లింపులు నిలిచిపోతు న్నాయి. ఈ పరిస్థితులు వ్యాపారాలపై తీవ్ర ప్రభా వం చూపుతుండటంతో డిసెంబర్‌లోనూ వాణిజ్య పన్నుల శాఖకు నష్టాలు తప్పవని తెలుస్తోంది.కుదేలైన చిరు వ్యాపారులు: ‘నోట్ల రద్దు’తో చిరు వ్యాపారులు పూర్తిగా కుదేలయ్యారు. చిల్లర వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులపై విస్తృత ప్రచారం చేస్తున్నా... క్షేత్రస్థాయిలో అమలు సంతృప్తికరంగా లేదు. ‘క్యాష్‌ లెస్‌’పై ప్రజలకు అవగాహన లేకపోగా.. వ్యాపారులకు సరైన సౌకర్యాల్లేవు. స్వైపింగ్‌ మెషిన్ల కొరతకు తోడు మెషిన్లు ఉన్న చోట కూడా మాటిమాటికీ మొరాయిస్తుండడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు నిలిచిపోతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement