పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి | recruite the scavangers in school | Sakshi
Sakshi News home page

పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి

Sep 5 2016 1:34 AM | Updated on Sep 4 2017 12:18 PM

పార్ట్‌టైమ్‌ స్వీపర్లు ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు.

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: పార్ట్‌టైమ్‌ స్వీపర్లు ఉన్న పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించకపోవడం వల్ల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకోపాధ్యాయ పాఠశాలలకు విద్యాబోధకులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పుష్కరఘాట్లలో వినియోగించిన ఆర్‌ఓప్లాంట్లను ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సీ నోటిఫికేషన్‌ వేసి వెంటనే పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రమేష్, గురుప్రసాద్, రాజు, పాండురంగాచారి, ఎన్‌.రమేష్, సదాశివుడు, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement