రాయలసీమ సదస్సు జయప్రదం చేయాలని‘హంస’ కార్యదర్శి చాముండేశ్వరి పిలుపునిచ్చారు.
అనంతపురం సిటీ: హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ (హంస) ఆధ్వర్యంలో ఈ నెల 18న వైస్సార్ కడప జిల్లాలో నిర్వహించే రాయలసీమ సదస్సును జయప్రదం చేయాలని కార్యదర్శి చాముండేశ్వరి పిలుపునిచ్చారు.
‘హంస’ నేతలు అనిల్‌కుమార్, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌ఓ పద్మావతిలు మంగళవారం తమ ఛాంబర్‌లో రాయలసీమ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హంస నేతలు విజ్ఞప్తి చేశారు.