రాంబుల్లెట్‌ గొర్రె కేరాఫ్‌ బొక్సంపల్లి | ram bullet care of boksampalli | Sakshi
Sakshi News home page

రాంబుల్లెట్‌ గొర్రె కేరాఫ్‌ బొక్సంపల్లి

Aug 25 2016 10:38 PM | Updated on Sep 4 2017 10:52 AM

రాంబుల్లెట్‌ గొర్రె కేరాఫ్‌ బొక్సంపల్లి

రాంబుల్లెట్‌ గొర్రె కేరాఫ్‌ బొక్సంపల్లి

మనం చూస్తున్న ఈ గొర్రె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ తరహా జాతికి చెందినది. దీనిపేరు రాంబుల్లెట్‌.

పెనుకొండ : మనం చూస్తున్న ఈ గొర్రె ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌  తరహా జాతికి చెందినది. దీనిపేరు రాంబుల్లెట్‌.  పెనుకొండలోని బొక్సంపల్లి గ్రామంలోని కొండారెడ్డి ఇంట్లో ఈ తరహా  గొర్రెలు 20 వరకు మనకు కనిపిస్తాయి.  గతంలో హిందూపురం ప్రాంతంలో ఓ  రైతు నుంచి ఈ రకం జాతి గొర్రెను తెచ్చి పెంపకం కొనసాగించగా నేడు 20 వరకు చేరుకున్నాయని ఆయన తెలిపారు.

ఈనేపథ్యంలో తన వద్ద ఉన్న గొర్రెల్లో ఒక గొర్రెకు జ్వరం సోకడంతో రైతు దీనిని పిల్లతో సహా పెనుకొండ పశువైద్యశాల వద్దకు తీసుకువచ్చాడు. ఒంటి నిండా బొచ్చుతో నిండిఉన్న ఈ గొర్రెను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement