రైల్వేస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్‌ఎం | railway drm unexperteded enquiry | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్‌ఎం

Aug 19 2016 11:54 PM | Updated on Sep 4 2017 9:58 AM

ప్రయాణికులను అడిగి తెలుసుకుంటున్న డీఆర్‌ఎం

ప్రయాణికులను అడిగి తెలుసుకుంటున్న డీఆర్‌ఎం

ఖమ్మం రైల్వేస్టేషన్‌ను శుక్రవారం రైల్వే డీఆర్‌ఎం ఆశీష్‌ అగర్వాల్‌ అకస్మికంగా తనఖీ చేశారు. స్టేషన్‌ పనితీరుపై సీసీఐ సురేందర్, ఎస్‌ఎం సూర్యచంద్రరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • వసతులపై సీసీఐ,ఎస్‌ఎంలపై ఆగ్రహం
  • ఆటో, టూవీలర్‌ పార్కింగ్‌పై దృష్టిపెట్టాలని  సూచన
  • ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
  • ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం రైల్వేస్టేషన్‌ను శుక్రవారం రైల్వే డీఆర్‌ఎం ఆశీష్‌ అగర్వాల్‌ అకస్మికంగా తనఖీ చేశారు. స్టేషన్‌ పనితీరుపై సీసీఐ సురేందర్, ఎస్‌ఎం సూర్యచంద్రరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం డీఆర్‌ఎం కృష్ణా పుష్కరాలకు విజయవాడలో హాజరై తిరుగు ప్రయాణంలో ఖమ్మం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.స్టేషన్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించి అసౌకర్యాల ఆరా తీశారు. స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలను,బుకింగ్,ఏటీవీఎం,మంచినీటి వసతి,వెయిటింగ్‌ హాల్‌ను పరిశీలించారు. అనంతరం సౌకర్యాల పట్ల ప్రయాణికులను డీఆర్‌ఎం అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ ప్రాంగణం బయట వాహనాల పార్కింగ్‌కు అధికంగా స్థలం కేటాయింపుపై, పుష్కరాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. డీఆర్‌ఎం వెంట సీనియర్‌ డీసీఎం సత్యనారాయణ,సీడీఓఎం క్రిష్టోఫర్, ఎస్‌డీఎస్‌ఓ మీనా,ఏడీజేఈ శ్రీనాథ్, ఖమ్మం కమర్శియల్‌ ఇన్స్‌పెక్టర్‌  సురేందర్,ఎస్‌ఎం సూర్యచంద్రారావు, సీఐ రాజు,ఎస్‌ఐ సుబ్బారావు ,రైల్వేసిబ్బంది చౌదరి, జావీద్‌ పాల్గొన్నారు.

    • ఆకస్మిక తనిఖీతో అధికారుల ఇక్కట్లు

     విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరుగుముఖంలో  సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలులో బయలు దేరిన డీఆర్‌ఎం ఖమ్మం వస్తున్నారని అర్ధగంటముందు  తెలుసుకున్న అధికారులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. డీఆర్‌ఎం వస్తున్న విషయంపై అధికారులు ఆగమేఘాల మీద స్టేషన్‌ ప్రాంగణాన్ని యుద్ధప్రాతిపదికన పరిశ్రుభత పనులు చేపట్టారు. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోయారు. ఏటీవీఎంలు ఉన్నప్పటికీ ప్రయాణికులు అంతగా అటువైపు చూడటం లేదు. అర్భాటంగా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఏటీవీఎంలకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. దీంతో  సొంతగానే రిటైర్డ్‌ ఉద్యోగులతో  వాటి సేవలు కొనసాగుతున్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement