
మార్క్సిజం.. అంబేడ్కరిజం మిళితం కావాలి
మార్క్సిజం, అంబేడ్కరిజం మిళితం అయితే దేశం బాగుపడుతుందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు.
ఆర్.నారాయణమూర్తి
మార్క్సిజం, అంబేడ్కరిజం మిళితం అయితే దేశం బాగుపడుతుందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.
ప్రశ్న: అంబేడ్కరిజమ్‌ను.. మార్క్సిజమ్ బలపరుస్తాందా?
సమాధానం: కారల్‌మార్క్స్ వర్గసమాజం గురించి చెప్పారు. అంబేడ్కర్ కులవర్గ రహిత సమాజం గురించి తెలిపారు. విభిన్న జాతులతో కూడుకున్న భారతదేశంలో రెండూ ఏకమవ్వాలి.
ప్ర: దేశం బాగుపడాలంటే ఏమి చేయాలి?
స: కులం లేని దేశం ఉండాలి.
ప్ర: ప్రస్తుత యూనివర్సిటీల పరిస్థితిపై మీ సమాధానం?
స: కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు రాజకీయపార్టీల అనుబంధం ఎక్కువైంది. అందుకే పార్టీలు ఓటు బ్యాంకు వ్యాపారం చేస్తున్నాయి.
ప్ర: ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం?
స: కళాశాలలో ర్యాగింగ్,కుల, మత, మానసిక ఒత్తిడులు ఉండకూడదు. రోహిత్, రిషితేశ్వరి వంటి ఘటనలు మళ్లీ జరగకూడదు.