గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి పోరాటం
Jul 21 2016 12:57 AM | Updated on Oct 2 2018 6:46 PM
నూతనకల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఆమ్‌ఆద్మీ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిలిచి ఉన్న మురుగు నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లు కుమ్మక్కై పనులు చేయకున్నా నిధులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శర్వాన్, మహంకాళి సోమయ్య, బ్రహ్మండ్లపల్లి మనోహర్, వెంకటేశ్వర్లు, వెంకన్న, తన్నీరు వెంకన్న పాల్గొన్నారు.
Advertisement
Advertisement