జిల్లాలో ఏడుగురు తహశీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ కోనశశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతపురం అర్బన్ : జిల్లాలో ఏడుగురు తహశీల్దార్లకు పోస్టింగ్ ఇస్తూ కలెక్టర్ కోనశశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లమాడ తహశీల్దారు నాగరాజును ఎన్‌పీకుంట తహశీల్దారుగా డ్వామా సూపరింటెండెంట్ శివయ్యను కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయ ఏఓగా అమరాపురం తహశీల్దారు శ్రీధర్‌బాబును ధర్మవరం ఆర్డీఓ కార్యాలయ ఏఓగా అక్కడే ఉన్న ఏఓ మాధవరెడ్డిని అమరాపురం తహశీల్దారుగా గుడిబండ తహశీల్దారు మహబూబ్‌బాషాను ధర్మవరం తహశీల్దారుగా డ్వామా సూపరింటెండెంట్ అన్వర్‌హుసేన్‌కు గుడిబండ తహశీల్దారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
