'పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు' | police working for ruling party, says gudivada amarnath | Sakshi
Sakshi News home page

'పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు'

Dec 4 2015 11:34 AM | Updated on Aug 21 2018 7:17 PM

'పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు' - Sakshi

'పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారని, ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలను అణిచేసి సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టాలని చూస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని డ్యూటీలు చేస్తున్నారని, ప్రతిపక్షం చేస్తున్న ఉద్యమాలను అణిచేసి సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టాలని చూస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ ప్రజాసమస్యలపై పోరాడితే అన్ని సెక్షన్లు అమలులోకి వస్తాయని, ఇదంతా చూస్తే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

అనూష కేసులో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆడియో రికార్డింగు ద్వారా నిర్ధారణ అయినా పోలీసు కమిషనర్ పట్టించుకోలేదని, అలాగే సీఐ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో కూడా పురోగతి లేదని ఆయన విమర్శించారు. కమిషనరేట్లో పైరవీలు చేసేవారికే పోస్టింగులు వస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితిలోనూ భయపడేది లేదని, ప్రజాసమస్యలపై వైఎస్ఆర్‌సీపీ తరఫున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement