ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం.
హత్యాయత్నంలో కేసులో పోలీసుల ముందడుగు
Dec 20 2016 12:13 AM | Updated on Jul 30 2018 8:37 PM
సీసీ కెమెరా ద్వారా నిందితుల గుర్తింపు
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సంచలనం సృష్టించిన న్యాయవాది హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు సమాచారం. సంఘటన స్థలం సమీపంలోని పెట్రోలు బంక్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సోవారం పోలసులు పరిశీలించారు. ఈ ఫుటేజ్‌లలో న్యాయవాది అజ్మతుల్లాను కారుతో ఢీకొట్టించి రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు సీఐ కృష్ణయ్య సంఘటన స్థలం చుట్టు పక్కల ఉన్న వారిని దర్యాప్తులో భాగంగా ప్రశ్నించారు. అయితే పెట్రోలు బంక్ సిబ్బంది, హోటళ్ల యజమానులు ఈ విషయంలో మౌనం పాటించారు. ఽఘటన జరిగిన ప్రాంతంలోని హోటల్‌ను ఆదివారం సాయంత్రం నుంచే మూసివేశారు. ఈకేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితును త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు.
Advertisement
Advertisement