ఇటీవల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పోటీల్లో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ అన్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు భేష్
Aug 11 2016 12:18 AM | Updated on Aug 21 2018 5:54 PM
వరంగల్ : ఇటీవల ఎస్సై, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన దేహదారుఢ్య పోటీల్లో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జరిగిన సమావేశంలో డీపీఓ సిబ్బంది, అధికారులకు ఆయన ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. అభ్యర్థుల ఆధార్‌కార్డ్, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్‌లో వేలిముద్రలను సేకరించడంలో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందన్నారు. కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీపీఓ ఈఓ నారాయణరెడ్డి, సూపరింటెండెంట్లు నాగేందర్‌సింగ్, మహమూద్, రమాదేవి, ఫర్హానా, సీఐలు జానీ నర్సింహులు, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement