వాళ్లిద్దరూ మట్టి చల్లారు | PM, CM Clay extinguish on people | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరూ మట్టి చల్లారు

Oct 22 2015 4:22 PM | Updated on Aug 15 2018 6:32 PM

వాళ్లిద్దరూ మట్టి చల్లారు - Sakshi

వాళ్లిద్దరూ మట్టి చల్లారు

బాబు ప్రత్యేక హోదా అడుగుతారని, మోదీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని ఇద్దరు ప్రజల ఆశలపై మట్టి చల్లారని వైఎస్సాఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

కడప: ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా అడుగుతారని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని, కానీ వాళ్లిద్దరూ ప్రజల ఆశలపై మట్టి చల్లారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

చంద్రబాబు తరహాలో మోదీ కూడా రెండు కేజీల మట్టి చల్లి వెళ్లిపోయారని తెలిపారు. హోదా రాకుంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ పూర్తిగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ రాజధాని నిర్మాణం చేపడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement