పరుగుపందెంలో పాల్గొన్న అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్ల శారీరక దారుఢ్య పరీక్షలు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కొనసాగుతున్నాయి.
ఖమ్మం క్రైం : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్ల శారీరక దారుఢ్య పరీక్షలు ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కొనసాగుతున్నాయి. ఎస్పీ షానవాజ్‌ఖాసీం పర్యవేక్షణలో 9వ రోజైన శనివారం 1,200 మంది అభ్యర్థులకు గాను 911 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు 800మీటర్లు పరుగుపందెం, 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ ఈవెంట్లను పూర్తిచేశారు. మహిళా అభ్యర్థులకు బయోమెట్రిక్, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చే సిన అనంతరం ఎత్తులో అర్హత సాధిం చిన వారిని 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ నిర్వహించా రు. స్పెషల్‌బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్‌డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు.