ముగిసిన ఫసియొద్దీన్‌ అంత్యక్రియలు | phasiyoddin funeral ended | Sakshi
Sakshi News home page

ముగిసిన ఫసియొద్దీన్‌ అంత్యక్రియలు

Jul 22 2016 1:15 AM | Updated on Sep 4 2017 5:41 AM

జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఖాజాఫసియొద్ధీన్‌ అంత్యక్రియలు గురువారం తన స్వగ్రామమైన అల్వాల గ్రామంలో నిర్వహించారు.

 హాలియా : జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఖాజాఫసియొద్ధీన్‌ అంత్యక్రియలు గురువారం తన స్వగ్రామమైన అల్వాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఫసియొద్దీన్‌ మతదేహాన్ని కడసారి చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు తరలివచ్చారు. ఆయన మృతి పట్ల టీసీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి ఫసియొద్దీన్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ అ«ధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ కాకునూరి నారాయణ, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు శాగం పెద్దిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బుర్రి రాంరెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అ«ధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, సర్పంచ్‌ జూపల్లి శ్రీనివాస్, యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ అ«ధ్యక్షుడు కసిరెడ్డి నరేశ్, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గౌని రాజారమేష్‌యాదవ్‌ ఎంపీటీసీలు ముత్యాలు, జంగయ్య, మైనారిటీ సెల్‌ నాయకులు నసీరుద్దీన్, అన్వర్‌ పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement