రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కుతూ జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.
గుంతకల్లు: రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్కుతూ జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లుకు చెందిన నాగరాజు (53) ధర్మవరంగేట్ రోడ్డులో ఓ గోల్డ్ స్మిత్ షాపులో పని చేసేవాడు. నాగరాజు శనివారం ఉదయం తన సొంత పని నిమిత్తం బెంగళూరు వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు టిక్కెట్ తీసుకున్నాడు. అప్పటికే రన్నింగ్‌లో ఉన్న రైలును ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశత్తు జారి రైలు కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డ నాగరాజును 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారు. రక్తం ఎక్కువగా పోవడంతో ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందాడు. జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.