ఆనాటి ఆ స్నేహమానందగీతం | Old students get-to-gether | Sakshi
Sakshi News home page

ఆనాటి ఆ స్నేహమానందగీతం

Aug 1 2016 11:44 PM | Updated on Sep 4 2017 7:22 AM

ఆనాటి ఆ స్నేహమానందగీతం

ఆనాటి ఆ స్నేహమానందగీతం

ఎదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..ఈ గాలిలో.. ఈ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి.. అంటూ బాల్యం మిగిల్చిన మధురానుభవాలను ఒక కవి అక్షరీకరించాడు.

1992–93 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ 
23 ఏళ్ల అనంతరం కలిసిన పూర్వ విద్యార్థులు
 
 
మక్కువ :ఎదలోతులో ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి..ఈ గాలిలో.. ఈ మమతలో మా అమ్మ మాటలాగ పలకరిస్తున్నాయి.. అంటూ బాల్యం మిగిల్చిన మధురానుభవాలను ఒక కవి అక్షరీకరించాడు. బాల్యం ఎన్నో మధునుభవాల సమాహారం. ఎన్నో అద్భుతాల సమ్మేళనం. ఎన్నేళ్లయినా మరిచిపోలేని జ్ఞాపకం. ఎక్కడెక్కడో స్థిరపడిన వారినీ లాక్కొచ్చే తారకమంత్రం. కాబట్టే సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. చిన్ననాటి స్నేహితుల్ని చూసి మురిసిపోయారు. అక్షరాలు నేర్పిన గురువుల్ని సన్మానించుకున్నారు. 23 ఏళ్ల క్రితం పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం కలుసుకున్నారు. దానికి వేదికైంది మక్కువలోని సాయి భగవాన్‌ కల్యాణ మండపం. 
 
ఆద్యంతం ఆకట్టుకుంది
మక్కువ జెడ్పీ పాఠశాలలో 1992–93 సంవత్సరం పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థుల అరుదైన సమ్మేళనం ఆద్యంతం ఆకట్టుకుంది. అప్పటి బ్యాచ్‌ విద్యార్థులైన నాని, ప్రసాద్, సత్యనారాయణ కషితో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి నాటి మిత్రులంతా ఎక్కడెక్కడినుంచో తరలి వచ్చారు. అప్పటి గురువులు లలిత, యర్రా సింహాచలం, రెడ్డి సత్యమూర్తి, వి.హరిమాస్టార్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గురువులు మాట్లాడుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్నేహితులను ఆదుకోవాలని సూచించారు. 
 
 
2019లో సిల్వర్‌ జూబ్లీ వేడుక
తమ బ్యాచ్‌ విద్యార్థులతో 2019లో 25ఏళ్ల సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాన్ని నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. అంతకుముందు పూర్వవిద్యార్థులంతా తాము చదువుకున్న పాఠశాలను సందర్శించారు. ప్రస్తుత విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పించారు. పాఠశాలలో వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయించారు.
 
 
 స్నేహితులను ఆదుకుంటా: బత్తుల వెంకట లోకేష్, సైంటిస్ట్, యూఎస్‌ఏ
యూఎస్‌ఏలో ఎమ్‌డీ ఆండర్స్‌సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాను. మక్కువ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1992–93 బ్యాచ్‌ స్నేహితుల జాబితా సేకరిస్తా. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తా. నాకు తోచిన సాయం చేస్తా. 
 
 
పాఠశాలలో సదుపాయాలు కల్పిస్తాం:జన్ని నాని, ఏపీఈపీడీసీఎల్‌ ఉద్యోగి
మేం చదువుకున్న పాఠశాలలో సదుపాయాల కల్పనకు కషి చేస్తాం. మేం చేయబోయే అంశాలను త్వరలో ప్రకటిస్తాం.  
 
 
ఉపాధ్యాయిని కావడం అదష్టం: మేళాపు కాంచన, క్రాఫ్ట్‌ టీచర్, జెడ్పీ హైస్కూల్, మక్కువ
చదువుకున్న పాఠశాలలోనే క్రాఫ్ట్‌ టీచర్‌గా పనిచేయడం పూర్వ జన్మసుకతం. ఈరోజు మేమంతా ఇలా ఉన్నామంటే మా గురువులే పుణ్యమే. 
 
 
మిత్రుల కష్టసుఖాలను పంచుకోవాలి: వి.ఉమాదేవి, ఫిజిక్స్‌ లెక్చరర్, ఎస్టీ గురుకుల పాఠశాల, పి.కోనవలస 
ఎక్కడున్నా మిత్రుల కష్టసుఖాలను పంచుకోవాలి. ఫిజిక్స్‌ లెక్చరర్‌గా స్థిరపడేందుకు అప్పటి గురువుల బోధనే కారణం. ఒకే వేదికపై గురువులు, పూర్వవిద్యార్థులం కలుసుకోవడం ఆనందంగా ఉంది. 
 
                                                      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement