తెలంగాణకు చంద్రబాబు ఎప్పుడూ శత్రువే! | Nizamabad MP Kavitha comments on chandrababu | Sakshi
Sakshi News home page

తెలంగాణకు చంద్రబాబు ఎప్పుడూ శత్రువే!

Jul 31 2016 4:07 AM | Updated on Aug 14 2018 11:26 AM

తెలంగాణకు చంద్రబాబు ఎప్పుడూ శత్రువే! - Sakshi

తెలంగాణకు చంద్రబాబు ఎప్పుడూ శత్రువే!

తెలంగాణకు ఎప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు శత్రువేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిజామాబాద్ ఎంపీ కవిత
 
 ధర్పల్లి : తెలంగాణకు ఎప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు శత్రువేనని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో మినీట్యాంక్‌బండ్ పనులకు ఎంపీ కవిత శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు మాట్లాడిన మాటలతో తెలంగాణపై చంద్రబాబు రంగు బయట పడిందన్నారు. రాజ్యసభలో రెండు రోజుల చర్చతో తెలంగాణకు మంచి జరిగిందన్నారు. ‘బీజేపీ నుంచి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్, టీడీపీ నుంచి సీఎం రమేష్ ఏం మాట్లాడారో చూశారు. ప్రజలు ఎవరి నైజం ఏంటో గమనించాలి. ఎంసెట్‌పై ఎన్నో వందల ఫోన్లు రెండు రోజులుగా వస్తున్నాయి.

ఒకపక్క రద్దు చేయాలని ఎంత మంది ఉన్నారో.. వద్దు అనేవారు అంతే మంది ఉన్నారు. అయితే ఒక రకమైన పరిస్థితుల్లో పేపర్ లీకేజ్ జరిగింది. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారు’ కవిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసే బిడ్డలందరికీ భవిష్యత్ కోసం పారదర్శకంగా వారికి రావాల్సిన అవకాశాలు రావాలంటే  మరో సారి ఎంసెట్-3  పరీక్ష పెట్టేలా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement