జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి | navarathnala sabha in penukonda | Sakshi
Sakshi News home page

జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి

Sep 1 2017 10:27 PM | Updated on Oct 20 2018 4:52 PM

జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి - Sakshi

జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం మళ్లీ రావాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు.

పెనుకొండ: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి  స్వర్ణయుగం  మళ్లీ రావాలంటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని  చేయాలని  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని వన్శికా గ్రాండ్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో  శుక్రవారం శంకరనారాయణ అధ్యక్షతన నవరత్నాల సభ జరిగింది.

ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వృద్ధులు, రైతులు, వితంతువులు అన్ని వర్గాల ప్రజలు జగన్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇసుక, పట్టిసీమ, ఇతర సంక్షేమ పథకాల్లో దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని, నవరత్నాలను గడప గడపకూ తీసుకెళ్లాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement