ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ | narendra modi, president pranab in ins sumithra | Sakshi
Sakshi News home page

ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ

Feb 6 2016 9:28 AM | Updated on Aug 15 2018 2:20 PM

ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ - Sakshi

ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ

విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మోహరించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ సుమిత్రను మరో 5 యుద్ధ నౌకలు అనుసరిస్తున్నాయి. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement