సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం | nandyal citizen died in soudi | Sakshi
Sakshi News home page

సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం

Oct 8 2016 11:14 PM | Updated on Sep 4 2017 4:40 PM

సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం

సౌదీలో నంద్యాల వాసి దుర్మరణం

సౌదీ అరేబియాలోని ఒమన్‌ ప్రాంతంలో ఉద్యోగం కోసం వెళ్లిన నంద్యాలకు చెందిన ఓ ఫార్మాసిస్ట్‌ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

నంద్యాల: సౌదీ అరేబియాలోని ఒమన్‌ ప్రాంతంలో ఉద్యోగం కోసం వెళ్లిన నంద్యాలకు చెందిన ఓ ఫార్మాసిస్ట్‌ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విజయ మిల్క్‌డెయిరీలోని ఎలక్ట్రిసిటీ విభాగంలో పని చేస్తున్న అబ్దుల్‌రహీంకు సయ్యద్‌ హుసేన్, రఫీ కుమారులు. ఆయన నూనెపల్లెలోని విజయభాను కాటన్‌ మిల్‌ ప్రాంతంలో నివాసం ఉన్నారు. పెద్ద కుమారుడు సయ్యద్‌ హుసేన్‌ కర్నూలులోని సఫా కాలేజీలో ఫార్మసీ కోర్సును పూర్తి చేశాడు. రఫీ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సయ్యద్‌ హుసేన్‌ గత ఏడాది నవంబర్‌లో సౌదీలోని ఓమన్‌కు వెళ్లి ఒక కంపెనీలో ఫార్మాసిస్ట్‌గా చేరాడు. ఆయన స్నేహితుడితో కలిసి మస్కట్‌కు కారులో వెళ్లి తిరిగి ఒమన్‌కు వెళ్తుండగా కారు బోల్తా పడింది. దీంతో ఆయన మృతి చెందాడు. ఈ సమాచారం అందడంతో అబ్దుల్‌రహీం కుటుంబం విషాదంలో మునిగింది. ఆయన మృతదేహం నంద్యాలకు రావడానికి రెండు మూడు రోజులు అవుతుందని సోదరుడు రఫీ చెప్పారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement