స్పీడ్‌ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ | Najma tallent in speed sketing | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ

Oct 17 2016 10:04 PM | Updated on Sep 4 2017 5:30 PM

స్పీడ్‌ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ

స్పీడ్‌ స్కేటింగ్‌లో నజ్మా ప్రతిభ

అరండల్‌పేట(గుంటూరు): స్పీడ్‌ స్కేటింగ్‌లో సిమ్స్‌ మై స్కూల్‌ విద్యార్థిని ఎం.డి.నజ్మా ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు సిమ్స్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ భీమనాథం భరత్‌రెడ్డి తెలిపారు.

 
  • ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం 
 
అరండల్‌పేట(గుంటూరు): స్పీడ్‌ స్కేటింగ్‌లో సిమ్స్‌ మై స్కూల్‌ విద్యార్థిని ఎం.డి.నజ్మా ఏసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించినట్లు సిమ్స్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ భీమనాథం భరత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థిని  అభినందన కార్యక్రమం సోమవారం పాఠశాలలో నిర్వహించారు. భరత్‌రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని తిరుపుర్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి యాంటి టెర్రరిజమ్, గ్లోబల్‌ వార్నింగ్‌  సదస్సు నిర్వహణ సందర్భంగా స్కేటింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలకు సిమ్స్‌ విద్యార్థిని ఎం.డి.నజ్మా హాజరై వరల్డ్‌ రికార్డు సాధించిందని పేర్కొన్నారు. ఎం.డి.నజ్మా ఆరో∙తరగతి చదువుతుందని, చిన్ననాటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొని జాతీయస్థాయిలో నగరానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం గర్వకారణమన్నారు. సిమ్స్‌ సంస్థల కరస్పాండెంట్‌ డాక్టర్‌ బి.శివశిరీష మాట్లాడుతూ స్కూల్‌ ప్రాంగణంలో అనుభవం కలిగిన శిక్షకులతో స్కేటింగ్‌ శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. డీన్‌.ఎల్‌.శ్రీనివాసరావు, స్కేటింగ్‌కోచ్‌ షేక్‌.సలాం తదితరులు పాల్గొన్నారు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement