హైదరాబాద్ శివార్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి | murder in hyderabad outcuts | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ శివార్లలో వ్యక్తి అనుమానాస్పద మృతి

Nov 20 2015 10:13 AM | Updated on Sep 7 2018 4:39 PM

పేట్‌బషీరాబాద్ పరిధిలోని దూలపల్లి అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్ సిటీ: పేట్‌బషీరాబాద్ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ నాలాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు బహుదూర్‌పల్లికి చెందిన పాల వ్యాపారి శ్రీనివాస్(37)గా గుర్తించారు. మృతుడు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మరో ఘటనలో నల్లగొండ జిల్లాలో రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆలేరు మండలం గుండ్లగూడెం వద్ద రైలు కిందపడటంతో వ్యక్తి శరీరం ముక్కలుగా తెగిపోడింది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement