రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం | MPDO office lock for corporation loan sanction | Sakshi
Sakshi News home page

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం

Apr 30 2016 4:27 AM | Updated on Aug 13 2018 8:03 PM

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం - Sakshi

రుణం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం

కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు.

కంగ్టి: కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడంలో అన్యాయం చేశారంటూ ఓ వ్యక్తి శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలి పారు. బోర్గి గ్రామానికి చెందిన ఎం.శ్రీకాంత్ కార్పొరేషన్ రుణం కోసం బ్యాంకు అధికారులు కాన్సెంట్ ఇచ్చినా తమకు రుణం మంజూరు చేయకుండా ఎంపీడీఓ మధుసూదన్ అడ్డుకోవడంతోపాటు లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాంత్ తన బావ, బోర్గి సర్పంచ్ శశికళ భర్త సంజీవ్‌తో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తాళం వేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement