తోటా.. ఇదేమి బాట | mp thota narasimham special status | Sakshi
Sakshi News home page

తోటా.. ఇదేమి బాట

Sep 16 2016 10:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

తోటా.. ఇదేమి బాట - Sakshi

తోటా.. ఇదేమి బాట

కాకినాడలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో హోదా కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన ప్యాకేజీ పథకం పాచిపోయిన లడ్డూలుగా అవహేళన చేస్తే ...

కాకినాడలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన ఆత్మగౌరవ సభలో హోదా కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించిన ప్యాకేజీ పథకం పాచిపోయిన లడ్డూలుగా అవహేళన చేస్తే ... ఆ మరుసటి రోజునే కాకినాడ ఎంపీ తోట నరసింహం స్పందిస్తూ పాచిపోయిన లడ్డూలు కాదు ... అ ప్యాకేజీ తిరుపతి లడ్డూలతో సమానమని అభివర్ణించారు. తరువాత ఏమయిందో ... ఏమో గానీ ఆయన సతీమణి రాణి ఆధ్యాత్మికతను మేళవించి హోదాకు ముడిపెట్టారు. ప్రత్యేక హోదా కావాలంటూ ఏకంగా శ్రీ లలిత సహస్రనామార్చనకు ఉపక్రమించారు. హోమం కూడా చేశారు. ఎంపీ తోట పాల్గొని ఆజ్యం పోశారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల కోసమే ఈ రాజకీయ ఎత్తుగడగా నగరవాసులు భావిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement