వ్యక్తిపై కొడవలితో దాడి | Mow man attack | Sakshi
Sakshi News home page

చౌటిపల్లె, తీవ్ర గాయాలు, కేసు నమోదు

Sep 2 2016 12:14 AM | Updated on Sep 4 2017 11:52 AM

మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన లింగేశ్వర్‌రెడ్డిపై సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి చేసినట్లు కొండాపురం ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

కొండాపురం: మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన లింగేశ్వర్‌రెడ్డిపై సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి చేసినట్లు కొండాపురం ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రెండు రోజుల నుంచి వర్షం కురవడంతో ఇళ్ల మధ్య బురదమయమైందన్నారు. అక్కడే పశువులు కూడా కట్టేయడంతో మరింత రొచ్చుగా తయారైందన్నారు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందన్నారు. దీంతో  లింగేశ్వర్‌రెడ్డి తలపై మచ్చుకొడవలితో సుధాకర్‌రెడ్డి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే అతన్ని అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement