కూతురుతోసహా తల్లి ఆత్మహత్య | mother sucside with chilld illnes | Sakshi
Sakshi News home page

కూతురుతోసహా తల్లి ఆత్మహత్య

Aug 3 2016 11:41 AM | Updated on Sep 4 2017 7:30 AM

కూతురుతోసహా తల్లి ఆత్మహత్య

కూతురుతోసహా తల్లి ఆత్మహత్య

అనారోగ్యం భరించలేక ఓ మహిళ తన కూతురుతోసహా ఆత్మహత్య చేసుకుంది.

► అనారోగ్యాన్ని భరించలేక బావిలో దూకి అఘాయిత్యం
► మల్యాలలో ఘటన

చందుర్తి(కరీంనగర్): అనారోగ్యం భరించలేక ఓ మహిళ తన కూతురుతోసహా ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోతే రెండేళ్ల తన కూతురు బతకలేదని చిన్నారితో సహా బావిలో దూకింది. ఈ విషాద సంఘటన చందుర్తి మండలం మల్యాలలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన మదాం సుజాత(32) రెండు నెలలుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన సుజాత ఉదయం కొడుకు వంశీ(10)ని పాఠశాలకు పంపించింది.

భర్త, కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగానే తన కూతురు విష్నిత(2)ను తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్‌ మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా తల్లి, కూతురు కనిపించలేదు. చుట్టు పక్కల వ్యవసాయ బావుల్లో గాలించగా గ్రామ శివారులోని బావిలో ఇద్దరూ శవమై కనిపించారు. చందుర్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. సుజాత తండ్రి గొంటి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement