కొడుకు పుట్టిన రోజు వద్దన్నందుకు... | Mother commit suicide | Sakshi
Sakshi News home page

కొడుకు పుట్టిన రోజు వద్దన్నందుకు...

Dec 15 2016 12:21 AM | Updated on Sep 2 2018 4:37 PM

కొడుకు పుట్టిన రోజు వద్దన్నందుకు... - Sakshi

కొడుకు పుట్టిన రోజు వద్దన్నందుకు...

తమ ముద్దుల కుమారుడు పుట్టిన రోజును ఘనంగా చేయాలని ఆమె భావించింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే భర్త ససేమిరా అనడంతో తట్టుకోలేకపోయింది. చివరకు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రి పాలైంది. గుత్తి పోలీసుల కథనం ప్రకారం...

  • ఓ తల్లి ఆత్మహత్యాయత్నం
  • పరిస్థితి విషమం, కర్నూలుకు తరలింపు
  • గుత్తి :
    కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామంలో లక్ష్మీ అనే ఇల్లాలు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. కొడుకు రాజు(4) పుట్టిన రోజు చేయాలనుకున్న ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే భర్త నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి తనువు చాలించాలనుకుంది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలించారు. గుత్తి పోలీసులు కేసు నమోదు  చేసుకుని తుగ్గలి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement