మోహన్‌బాబు 40 సినీవసంతాల వేడుక | mohanbabu success of 40 years fuctiong in vizag | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు 40 సినీవసంతాల వేడుక

Aug 23 2016 8:59 PM | Updated on Aug 28 2018 4:32 PM

మోహన్‌బాబు 40 సినీవసంతాల వేడుక - Sakshi

మోహన్‌బాబు 40 సినీవసంతాల వేడుక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాధారణ వ్యక్తిగా ప్రవేశించి, క్రమశిక్షణ గల నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన సినీ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు 40 సినీ వసంతాల వేడుక విశాఖలో జరగనుంది.

డాబాగార్డెన్స్‌: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాధారణ వ్యక్తిగా ప్రవేశించి, క్రమశిక్షణ గల నటుడిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన సినీ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు 40 సినీ వసంతాల వేడుక విశాఖలో జరగనుంది. వచ్చే నెల 17న కనీవినీ ఎరుగని రీతిలో కన్నుల పండవగా నిర్వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శినీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించడానికి మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు మంగళవారం విచ్చేసి వేదికను పరిశీలించి ఖరారు చేశారు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానుండడంతో బస ఏర్పాట్లపై మంచు విష్ణు సమీక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement